Ram Charan : ప్రస్తుతం చరణ్ రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ప్రభాస్ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో చరణ్ టాప్‌లో నిలిచాడు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్.. ఈ చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ చిత్రం తర్వాత చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. దీనితో పాటు RC16 సినిమాను లైన్లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యలర్ షూటింగ్ జరగనుంది. ఈ క్రమంలో చరణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గేమ్ ఛేంజర్ ఆర్‌సీ 16కి చరణ్ భారీగా పారితోషికంపెంచాడట. ఏకంగా 30 శాతం పెంచాడట. అంటే దాదాపు రూ. 30 కోట్లు పెంచినట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ సినిమాలకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా అంటున్నారు. సన్నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత దిల్ రాజు దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు, లీక్‌లు మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇందులో చరణ్ ప్రభుత్వం అధికారికగా కనిపించనున్నాడని ముందు నుంచి వినిపిస్తున్న టాక్. సెట్స్‌పై ఎప్పుడో వచ్చిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల బ్రేక్స్ తీసుకుంటూ స్లో స్లో షూటింగ్‌ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లేదా, అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట.