Upasana Konidela : అపోలో హాస్పిటల్స్ చైర్మైన్ గా, రామ్ చరణ్ భార్య గా ఉపాసన కొణిదెల కి ఒక మంచి ఇమేజి ఉంది. సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉండే అమ్మాయిగా కనిపించే ఉపాసన, ఇది వరకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి జనాల్లో చైతన్యం తెచ్చేందుకు ఎంతో శ్రమించింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఉపాసన తో దిగిన లేటెస్ట్ సెల్ఫీ ఫోటోని అప్లోడ్ చేస్తూ ‘కారా మమ్మీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేసాడు. దీనికి ఉపాసన రిప్లై ఇస్తూ ‘థాంక్యూ మిస్టర్ సి..మీ సెల్ఫీ స్కిల్స్ అద్భుతం’ అనింది.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా అయ్యింది. రామ్ చరణ్ ఉపాసన ని పేరు పెట్టి పిలవకుండా, ఇలా కారా మమ్మీ అని పిలవడంతో, అభిమానులు కూడా ఆమెకి సోషల్ మీడియా లో ‘కారా మమ్మీ కి శుభాకాంక్షలు’ అని పోస్టులు పెడుతున్నారు. ఇక నుండి ఆమెని అభిమానులు ఇలాగే పిలుస్తారట. ఈ దంపతులిద్దరికీ పుట్టిన పాపకి క్లిన్ కారా అని నామకరణం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాపకి సంబంధించిన ఫోటోలు ఏడాది పాటు గుప్తంగా ఉంచినప్పటికీ రీసెంట్ గా కొన్ని ఫోటోలను అభిమానుల కోసం విడుదల చేసాడు రామ్ చరణ్. పాపకి నడక నేర్పిస్తున్నట్టు దిగిన ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇకపోతే నేటితో ఉపాసన తన 35 వ సంవత్సరం లోకి అడుగుపెడుతుంది. ప్రతీ పుట్టినరోజుకి ఉపాసన కి ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చే రామ్ చరణ్, ఈసారి కూడా మంచి ప్లేస్ కి ఆమెని తీసుకెళ్ళడట. ఇదంతా పకక్న పెడితే #RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రంలో హీరో గా నటించాడు. రీసెంట్ గానే రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేసాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘జరగండి..జరగండి’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఇప్పుడు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram