Ram Charan : బాధపడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్.. కారణం చిరంజీవి ఇందులో నటించకపోవడమేనా..!

- Advertisement -

Ram Charan ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.

Ram Charan
Ram Charan

అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సరికొత్త ఆడ్ ద్వారా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తూ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడమే కాకుండా నాన్నను చూసి నేర్చుకున్నాను అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్స్ యాడ్ చాలా బాగుంది. ప్రముఖ బ్రాండెడ్ బట్టల సంస్థ మాన్యవర్ కోసం ఈ యాడ్ చేశారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ నాన్న అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను. ఆయనను చూసి చేసే పనిలో పట్టుదలతో ఉండాలని, మనల్ని ప్రేమించే వారిని ఎక్కువగా మనకంటే ప్రేమించాలని తెలుసుకున్నాను.

Ram Charan Chiranjeevi

తన గురించి ఆలోచనని వారికోసం ఆలోచించడం నాన్నను చూసే నేర్చుకున్నాను, జీవితంలో నిలబడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను అంటూ రామ్ చరణ్ ప్రతి ఒక్క నాన్న కొడుకుల కథని ఒక చిన్న యాడ్ లో చూపించేశాడు. తండ్రి కొడుకుల బంధం తో పాటుగా యాడ్ కూడా బాగా వచ్చింది. ఈ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులందరూ కూడా ఈ వీడియోలో నాన్న పాత్రలో చిరంజీవి చేసే ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here