Ram Charan – Lavanya Tripathi : టాలీవుడ్ లో క్యూట్ ప్రేమ జంటగా ఒక రేంజ్ లో ట్రెండ్ అయినా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి రీసెంట్ గానే ఇటలీ లో కుటుంబ సభ్యులు మరియు బందు మిత్రుల సమక్షం లో అట్టహాసంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చలు నడుస్తున్నాయి.

అలా చర్చల ద్వారా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. అదేమిటంటే అప్పట్లో రామ్ చరణ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య ఒక రేంజ్ లో రొమాన్స్ జరిగిందట. ఇదేంటి అప్పటికే ఉపాసన ని పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, లావణ్య త్రిపాఠి తో రొమాన్స్ చెయ్యడం ఏమిటి?, ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కొట్టి పారేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏమిటంటే వీళ్ళ మధ్య నిజమైన రొమాన్స్ అయితే జరగలేదు. అప్పట్లో రామ్ చరణ్ మరియు కృష్ణ వంశీ కాంబినేషన్ లో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ కి ఈ చిత్రం కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది. కమర్షియల్ గా యావరేజి అనిపించుకున్నప్పటికీ రామ్ చరణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర ని ముందుగా లావణ్య త్రిపాఠి తో చేయించాలని అనుకున్నారట.

రామ్ చరణ్ రేంజ్ స్టార్ హీరో తో నటించే అవకాశం రావడం తో లావణ్య కూడా వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అందులో భాగంగా ముందుగా రామ్ చరణ్ – లావణ్య త్రిపాఠి మధ్య కొన్ని రొమాంటిక్ ఫోటో షూట్ చేసాడట డైరెక్టర్ కృష్ణ వంశీ. కానీ ఎందుకో ఆయనకీ వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ నచ్చలేదు. ముద్దు ఫోజులలో లావణ్య త్రిపాఠి చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్నీ కృష్ణ వంశీ గమనించాడట. దీంతో ఆయన లావణ్య త్రిపాఠి ని తప్పించి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రొమాన్స్ సన్నివేశాల్లో ఎలా రెచ్చిపోయి నటించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.