Dhoom 4 : షారుఖ్ ఖాన్ తో కలిసి ‘ధూమ్ 4’ లో రామ్ చరణ్.. న్యూ ఇయర్ కి బ్లాస్టింగ్ అప్డేట్!

- Advertisement -

Dhoom 4 : ‘మగధీర’ తర్వాత నుండే రామ్ చరణ్ కి పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ఉంది. ఆ ఫేమ్ తోనే ‘జంజీర్’ సినిమా బాలీవుడ్ లో చేసాడు కానీ, ఆ చిత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు. అనంతరం ఆయన ఎలాంటి బాలీవుడ్ సినిమాలోనూ నటించలేదు కానీ, ఆయన హిందీ డబ్ సినిమాలకు యూట్యూబ్ లో మంచి క్రేజ్ వచ్చింది.

Dhoom 4
Dhoom 4

ఇక గత ఏడాది విడుదలైన #RRR చిత్రం తర్వాత అయితే రామ్ చరణ్ బాలీవుడ్ ఆడియన్స్ బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ బాలీవుడ్ హీరోలతో సమానంగా ఉంది. అంతే కాదు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ వంటి హీరోలు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే రామ్ చరణ్ – షారుఖ్ ఖాన్ కలిసి ధూమ్ 4 చిత్రం లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Shah rukh khan Ram charan

యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే ఈ ధూమ్ సిరీస్ కి ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఈ మూడు సినిమాల్లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ మరియు అమీర్ ఖాన్ దొంగ పాత్రల్లో కనిపించగా, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే ఈసారి అభిషేక్ బచ్చన్ పోషించిన పోలీస్ పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ ఇందులో దొంగగా కనిపిస్తాడట. వచ్చే ఏడాది లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది.

- Advertisement -
ram charan

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సుజయ్ ఘోష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరోపక్క రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన బుచ్చి బాబు తెరకెక్కించే సినిమాలో నటిస్తున్నాడు,అలాగే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ఒక సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ పూర్తి అయిన వెంటనే ధూమ్ 4 షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here