హాలీవుడ్ వెబ్ సిరీస్ లో రామ్ చరణ్.. ఆస్కార్ వేదికపై అధికారిక ప్రకటన?

- Advertisement -

మెగా పవర్ స్టార్ Ram Charan ..ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది.ఎక్కడ చూసిన ఈయన గురించే చర్చ,#RRR సినిమా తో రాజమౌళి కి ఎంత పాపులారిటీ వచ్చిందో, అంతటి పాపులారిటీ రామ్ చరణ్ కి కూడా వచ్చింది. ఇటీవలే HCA అవార్డ్స్ ఫంక్షన్ లో మన టాలీవుడ్ తరుపున నుండి హాలీవుడ్ ప్రెస్టీజియస్ అవార్డు కి ప్రెజెంటర్ గా వ్యవహరించిన రామ్ చరణ్, అదే ఈవెంట్ లో స్పాట్ లైట్ అవార్డుని కూడా అందుకున్నాడు.

ram charan
ram charan

అంతే కాకుండా అంతర్జాతీయ పాపులర్ టాక్ షోస్ లో కూడా పాల్గొని సంచలనం సృష్టించాడు. అలా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తైన తర్వాత హాలీవుడ్ లో కూడా నటిస్తానని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్ విని అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.

ram charan for hollywood web series

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ తో ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఒక వెబ్ సిరీస్ చేసేందుకు ఇటీవలే డీల్ కుదిరించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన స్వయంగా రామ్ చరణే చేయబోతున్నాడట. ఈ నెల 12 వ తారీఖున ఆస్కార్ అవార్డ్స్ వేదికపై ఈ విషయాన్నీ ఆయన తెలియచెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించబోయ్యే ఈ వెబ్ సిరీస్, ఒక సూపర్ హీరో స్టోరీ తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

- Advertisement -
ram charan shankar

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు అయిపోయాక సుకుమార్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది.ఇలా చేతిలో ఉన్న ఈ సినిమాలు పూర్తైన తర్వాతే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ ఉండబోతున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here