ట్రిపుల్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్. ఇకపై తాను తీయబోవే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ట్రిపుల్ఆర్ చిత్రం సమయంలోనే అనౌన్స్ చేశారు. ఇప్పటికీ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి సినిమ షూటింగ్ పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి. కారణం శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే.
దర్శకుడు శంకర్ నెలలో 15 రోజులు కమల్ సినిమాకు మిగతా 15రోజులు గేమ్ చేంజర్ చిత్రానికి కేటాయించడంతో రామ్ చరణ్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. వచ్చే సంవత్సరం వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శంకర్ సినిమా అంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లోని పాటలను చిత్రీకరించేందుకు చాలా ఖర్చుచేస్తారు. అందుకే అన్ని సినిమాల కంటే భిన్నంగా శంకర్ చిత్రాల్లోని పాటలు ఉంటాయి. సమాచారం ప్రకారం శంకర్ తన సినిమాలోని పాటలకు మూవీ బడ్జెట్లో సగానికి పైగా కేటాయిస్తారట. ఇక గేమ్ చేంజర్ సినిమాకు కూడా ఇదే ప్లాన్ చేశారట.
గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. సినిమాను దాదాపు రూ.300కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారట. ఇందులో ఐదుపాటలుంటాయని టాక్. ఈ పాటలను చిత్రీకరించేందుకు శంకర్ అండ్ టీం దాదాపు రూ. 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. అంత బడ్జెట్ కేవలం పాటల కోసమే ఖర్చు చేస్తున్నారంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లయినా సినిమా నుంచి కొత్త అప్డేట్ రాకపోవడంతో నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేసి మెగా ఫ్యాన్స్ తిట్ల దండకం అందుకుంటున్నారట. దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.