Ram Charan కి మరో అంతర్జాతీయ అవార్డు.. ఇది దేశానికే గర్వకారణం

- Advertisement -

Ram Charan : గత ఏడాది విడుదలైన #RRR సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లింది.ఈ సినిమాలో ఆయన చూపించిన అద్భుతమైన నటనకి అవతార్ మరియు టైటానిక్ లాంటి సినిమాలు తీసిన జేమ్స్ కెమరూన్ వంటి దిగ్గజాలు కూడా ముగ్దులై రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.అయితే రామ్ చరణ్ కి పేరు దక్కకుండా చేసేందుకు మూవీ టీం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

Ram Charan
Ram Charan

జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలను మ్యూట్ చేసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్లోడ్ చేసింది.కానీ ప్రతిభ ని ఎవ్వరూ దాచాలన్నా దాగదు, ఎప్పటికైనా బయట పడాల్సిందే.అందుకే జేమ్స్ కెమరూన్ ప్రత్యేకంగా ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రని మరోసారి ప్రశంసించారు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

RRR Movie

ఇప్పుడు రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ కి చెందిన ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటిగా పిలవబడే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్’ అవార్డ్స్ ఈవెంట్ కి పాల్గొనాల్సిందిగా ప్రత్యేకమైన ఆహ్వానం దక్కింది.అలా ఇండియా నుండి ఇప్పటి వరకు రామ్ చరణ్ కి మాత్రమే అలాంటి ఆహ్వానం దక్కిందట, లాస్ ఏంజిల్స్ లో జరగబొయ్యే ఈవెంట్ కి రామ్ చరణ్ ఇప్పటికే ప్రయాణమయ్యాడు.

- Advertisement -
Ram CHaran in RRR Movie

ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటుగా హాలీవుడ్ దిగ్గజ నటులు మరియు దర్శకులు కూడా హాజరు కాబోతున్నారు.అలా హాలీవుడ్ దిగ్గజాల మధ్యలో మన తెలుగు హీరో రామ్ చరణ్ కూర్చోవడం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి కూడా గర్వకారణం.అంతే కాదు ఈ ఈవెంట్ లో #RRR చిత్రానికి స్పాట్ లైట్ అవార్డు కూడా ఇవ్వబోతున్నారట.

Ram charan For HCA
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here