Ram Charan : ఎప్పుడూ కూల్ గా ఉండే రామ్ చరణ్ కు ఏంటి అంత కోపం వచ్చిందా ? ఆయన ఏకంగా తెలుగు డైరెక్టర్ కి స్ట్రైట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మామూలుగా రాంచరణ్ చాలా సాఫ్ట్ అన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా అనవసరంగా ఎవరి జోలికి పోడు. తన జోలికి ఎవరైనా వచ్చినా పెద్దగా పట్టించుకోవడు. అలాంటి రామ్ చరణ్ కి కోపం వచ్చేసింది. అందుకే ఏకంగా దర్శకుడి ఇంటికి డైరెక్టుగా వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాడట.
ఆయన మరెవరో కాదు బింబిసారా డైరెక్టర్ వశిష్ట. కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
కథానుగుణంగా ఈ సినిమాలో చాలా చాలా డీప్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. అంత ఏజ్ ఉన్న చిరంజీవి అలాంటి యాక్షన్ సీన్స్ చేయడం కష్టం . అందుకే రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ అన్నింటిని డూప్ పెట్టి తీయమన్నాడట చరణ్. కానీ చిరంజీవి మాత్రం అందుకు ఒప్పుకోలేదట.. ఏది ఏమైనా నేనే చేస్తాను అంటూ మొండి పట్టుదల పట్టారట. దీంతో చరణ్ అంత ఏజ్ ఉన్న ఆయన అలాంటి షాట్స్ చేస్తే ప్రమాదమని భావించి.. డైరెక్టర్ తో ఆయనతో ఇలాంటి షాట్స్ తీస్తే సినిమానే ఆపేస్తామంటూ వశిష్టకు స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు వశిష్ట కూడా.. వద్దు సార్ డూప్ పెట్టి మానేజ్ చేద్దామన్న చిరంజీవి వినట్లేదట. దీంతో ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.