Salaar : ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మాత్రమే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు మామూలు స్థాయిలో లేవు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి వందల కోట్ల రూపాయల్లో నష్టాలు వాటిల్లాయి.

ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు ఫ్యాన్స్. పైగా ఈ చిత్రం విడుదల సమయం లో మొదటి నాలుగు రోజులు సెలవులు కావడం తో బాక్స్ ఆఫీస్ ఊచకోత మామూలు రేంజ్ లో ఉండదని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

అప్పుడే ఈ చిత్రానికి లక్షకు పైగా డాలర్స్ వచ్చినట్టుగా సమాచారం. ఒక్క #RRR కి మినహా, ఏ చిత్రానికి కూడా ఇప్పటి వరకు ఈ స్థాయి ట్రెండింగ్ లేదు. కచ్చితంగా ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక క్రేజీ న్యూస్ ఒకటి బయటపడింది. అదేమిటంటే ఈ చిత్రం ముందుగా ప్రభాస్ తో చెయ్యాలని అనుకోలేదట మేకర్స్.

వాళ్ళ మైండ్ లో మొదటి నుండి ‘సలార్’ చిత్రం రామ్ చరణ్ తో మాత్రమే చెయ్యాలని ఉండేదట. ఆ ఉద్దేశ్యం తోనే అప్పట్లో రామ్ చరణ్ వద్దకి వెళ్తే , ప్రస్తుతం #RRR సినిమాలకు డేట్స్ ఇచ్చేసానని, రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు షూటింగ్ ముగుస్తుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి ఈ సినిమాకి కచ్చితమైన డేట్స్ ఇవ్వలేనని చెప్పాడట. దాంతో ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కి షిఫ్ట్ అయ్యింది.