Ram Charan : మెగాస్టార్ చిరంజీవి లాగానే ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో సంస్కారవంతుడు. ఆయన తన తోటి నటీనటులకు మర్యాదలు ఇవ్వడం లో కానీ, తన కంటే పెద్ద వారి పట్ల అమిత గౌరవం చూపడం లో కానీ రామ్ చరణ్ ని మించిన వారు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అక్కినేని నాగార్జున కూడా ఒక సందర్భం లో సంస్కారానికి పెట్టింది పేరు, మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్ అని చెప్తాడు.

కేవలం నాగార్జున మాత్రమే కాదు, వెంకటేష్, మోహన్ బాబు , బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకు కూడా రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రామ్ చరణ్ కి ఒక సీనియర్ హీరోయిన్ అంటే పరమ అసహ్యం అట. ఆమె పేరు పిలవడం కూడా మహా పాపం లాగ భావిస్తాడు అట.

ఆ హీరోయిన్ మరెవరో కాదు, రోజా. ఈమెకి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మీద ఎంత దారుణమైన విమర్శలు చేసిందో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నాడు, అతని మీద విమర్శలు చేసినా ఒక అర్థం ఉంది. కానీ రాజకీయ పరంగా గత దశాబ్ద కాలం నుండి దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ని కూడా ఈమధ్య కాలం లో ఆమె తిట్టింది.

దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా చాలా తీవ్రమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇకపోతే రామ్ చరణ్ కెరీర్ లో ఫ్యామిలీ హిట్ గా నిల్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం లో జయసుధ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాత్ర ని మొదట రోజా కోసం అడిగారట. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, వెంటనే కృష్ణ వంశీ కి నో చెప్పి, ఆమె సెట్స్ లోకి అడుగుపెడితే నేను అసలు సినిమానే చెయ్యను అని వార్నింగ్ ఇచ్చాడట. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, రామ్ చరణ్ కి రోజా అంటే ఎంత చిరాకు అనేది.