Ram Charan : బుచ్చిబాబు మాములోడు కాదుగా.. రామ్ చరణ్ కోసం ఏకంగా ఆ హాట్ బ్యూటీ కూతురునే రంగంలోకి దింపాడు..

- Advertisement -

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. ఆమె తాతయ్య నటుడు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే… స్టార్ కిడ్! ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ కూడా స్టార్ కిడ్ అని టాక్. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Ram Charan

అందులో కథానాయికగా రషా తడానీ పేరు పరిశీలిస్తున్నారట. ఇంతకీ, ఎవరీ అమ్మాయని ఆలోచిస్తున్నారా? బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’, నాగార్జున సరసన ‘ఆకాశ వీధిలో’ సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా. రవీనా భర్త ఎవరో తెలుసుగా? ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అనిల్ తడానీ! రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా కోసం రషా తడానీకి ఇటీవల లుక్ టెస్ట్ చేశారట. దాంతో RC 16 టీమ్ హ్యాపీగానే ఉందట. యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మరో వర్క్ షాప్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

అందులో కూడా రషాకు పాస్ మార్క్స్ వస్తే సెలెక్ట్ అయినట్లే! లేదంటే మరొక కథానాయికను వెతికే పనిలో బుచ్చి బాబు ఉంటారు. హిందీలో ‘రాక్ ఆన్’, ‘కేదార్ నాథ్’ సినిమాల ఫేమ్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రషా తడానీ ఒక సినిమా చేస్తున్నారు. అందులో అజయ్ దేవగణ్ ఫ్యామిలీకి చెందిన అమన్ హీరో. అయితే… ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అందుకుని, రషాకు లుక్‌, యాక్టింగ్‌ టెస్ట్‌లు!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here