Naga Chaitanya కొత్త ఇంటికి అంత ఖర్చు పెట్టాడా? ఎవరికోసమో తెలుసా?

- Advertisement -

అక్కినేని Naga Chaitanya గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అయితే చైతన్య మాత్రం ఎటువంటి వార్తలు వచ్చినా పట్టించుకోడు. అక్కినేని వంటి బడా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతు.. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. వివాహం తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు.. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు.. అయితే తాజాగా నాగ చైతన్య ఒక లగ్జరి ఇంటిని కొనుగోలు చేసాడు.. ఆదునాతన సౌకర్యాలు కలిగిన ఆ ఇల్లు చాలా ఖరీదైనది..

Naga Chaitanya
Naga Chaitanya

హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఏరియాలో ఈ ఇల్లు ఉంది. వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత నటుడు మురళీ మోహన్ కి చెందిన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసి అక్కడ ఉండేవారు. విడాకుల తర్వాత నాగచైతన్య తండ్రి నాగార్జున ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత హోటల్ కు షిప్ట్ అయ్యాడు.అయితే సమంతతో కలిసి ఉన్నప్పుడే భారీగా ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలని ప్లాన్ చేశారు. స్థలం కొని తమ అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేయించి నిర్మాణం చేపట్టారు..వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు..అయితే నాగచైతన్య ఆ ఇంటిని మాత్రం ఆపలేదు..

అయితే సమంతతో కలిసి ఉన్నప్పుడే భారీగా ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలని ప్లాన్ చేశారు. స్థలం కొని తమ అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేయించి నిర్మాణం చేపట్టారు. కానీ, ఇంతలోనే సమంత చైతూకు దూరం అయింది. కానీ, చైతు మాత్రం ఇంటి నిర్మాణం ఆపలేదు. తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని నిర్మించుకున్నాడు. పనులన్నీ పూర్తి కావడంతో వారం రోజుల క్రితం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. ఇక ఈ ఇంటి ఖరీదు తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు.. జిమ్, లైబ్రరీ, థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల హంగులతో పాటు విశాలమైన గార్డెన్ కలిగిన ఈ ఇంటి కోసం చైతు ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు పెట్టాడట. అన్నట్లు నాగచైతన్య కొన్న కొత్త ఇల్లు… అతని తండ్రి నాగార్జున నివాసానికి సమీపంలోనే ఉంది. కుటుంబానికి ఎప్పుడూ చేరవలో ఉండాలన్న ఉద్ధేశంతోనే చైతు తండ్రికి దగ్గరగా ఇంటిని నిర్మించుకున్నాడని తెలుస్తోంది.. అంతేకాదు ఆ ఇంటిని శోభిత దూలిపాలతో ఆ ఇంట్లోకి వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here