Klin Kara : రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 20న ఓ పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవలే ఆ చిన్నారికి క్లీంకార కొణిదేల అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ చిన్నారి పుట్టకముందు నుంచే రామ్ చరణ్ దంపతులతో పాటు పలువురు మెగా ఫ్యామిలీ సన్నిహితులు..చిన్నారికి పలు గిఫ్ట్ లు ఇచ్చారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ.. బేబీ కోసం ఓ చక్కటి ట్యూన్‌ను కంపోజ్ చేయగా.. మరికొందరు ఈ చిన్నారికి బహుమతులు అందజేశారు. అయితే పాప పుట్టాక తనను తన అత్త మామల వద్ద పెరిగేలా చూసుకుంటానంటూ ఉపాసన ఇన్ స్టా వేదికగా అప్పట్లో చెప్పారు.
ఈ క్రమంలో చెర్రీ తన ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా తన చిన్నారి కోసం ఓ స్పెషల్ రూమ్‌ను రెడీ చేసినట్లు చూపించారు. ప్రముఖ డిజైనర్లు ప్లాన్ చేసిన ఈ నర్సరీని ఫారెస్ట్ థీమ్‌తో రూపొందించినట్లు ఓ వీడియోలో తెలిపారు. సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిన విషయమే. ఇక తమ పిల్లల కోసం కావాల్సిన ప్రతి ఒక్కటినీ అందుబాటులో ఉంచుతారు. అన్నీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అలానే రామ్ చరణ్ ఉపాసన కూడా తమ పాప కోసం ముందునుంచే అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కావాల్సిన అన్నింటినీ ముందుగానే అందుబాటులో ఉంచుతున్నారు.
అమె కోసం ఓ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే పాప క్లీంకార కోసం రామ్ చరణ్ – ఉపాసన ఓ స్పెషల్ నర్సరీ రూమ్ ను తయారు చేయించారు. ఫారెస్ట్ థీమ్ తో ఈ నర్సరీని రూపొందించినట్లు తెలిపారు ఉపాసన. ఓ స్పెషల్ డిజైనర్ చేత ఇదంతా ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ఉపాసన ఈ మధ్యనే తల్లి అయిన నేపథ్యంలో ఆమెకు ప్రశాంతత చేకూరేలా దృష్టిలో ఉంచుకుని ఈ నర్సరీ గదిని రూపొందించాం. అలాగే ఈ నర్సరీ.. అడవులపై రామ్-ఉపాసనలకు ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. పాప వాటిని చూడగానే ప్రేమించగలిగేలా ఈ గదిలో ప్రతీదాన్ని ఏర్పాటు చేశాం అని నర్సరీ డిజైనర్ పేర్కొన్నారు.