Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న చెర్రీ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. అతని చివరి చిత్రం RRR విడుదలై మూడేళ్ళు అవుతున్నా..ఇంకా చరణ్ నుండి ఎలాంటి సినిమా రాకపోవడంతో చరణ్ రాబోయే గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా చరణ్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు, చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతనెవరో కాదు టాలీవుడ్ యాంగ్రీ మాన్ రాజశేఖర్. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో రాజశేఖర్ కీలక పాత్ర పోషించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం చరణ్ తో చేస్తున్న ఈ సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు రాజశేఖర్. చరణ్, బుచ్చిబాబు సినిమాలో రాజశేఖర్ అసలు నటిస్తున్నాడా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడన్న వార్తల్లో నిజం లేదని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు సీనియర్ సినీ పండితులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రాజశేఖర్‌కి ఈ సినిమాలో అవకాశం వస్తే రాజశేఖర్‌కి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరింత కెరీర్ వుందనడంలో అతిశయోక్తి లేదు.