మెగా పవర్ స్టార్ Ram Charan వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. రామ్ చరణ్, భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ఎన్నో అంచనాలు రేపుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.. అయితే రామ్ చరణ్ చేస్తున్న RC15 సినిమా గురించి బయట చాలానే లీకులు ఉన్నాయి. సినిమా ఘాట్ అల్మోస్ట్ అవుట్ డోర్ లోనే జరుగుతుండటంతో ఇప్పటికే చాలా ఫోటోలు , వీడియోస్ లీకయ్యాయి. అయితే సినిమా కంటెంట్ కూడా లీకవుతూ వస్తుంది. ఈ సినిమాలో చరణ్ ను ఓ రాజకీయ నాయకుడి గా చూపిస్తున్నాడట శంకర్..

ప్రస్తుతం రామ్ చరణ్ కర్నూలులో సందడి చేస్తున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద రామ్ చరణ్ నటిస్తున్న సినిమా చిత్రికరణ జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమా చిత్రీకరణను కొండారెడ్డి బురుజుపై తీస్తున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ కర్నూలు ఇప్పటికే చేరుకుని సినిమా చిత్రీకరణలో పాల్గోన్నారు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని కర్నూలులో చూసి సంతోషంతో కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా.. శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నూతన చిత్ర తెరకెక్కనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు నటించనున్న మరో హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల అక్కడికి చేరుకున్నారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పార్టీ పెట్టడం, ఉద్యమం చేయడం లాంటివి ఉంటాయట. శ్రీకాంత్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అతని కొడుకు పాత్రలో ఎస్ జె సూర్య కనిపించనున్నాడు. చరణ్ తో శంకర్ పక్కా పొలిటికల్ డ్రామా తీయనున్నాడన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరికొత్తగా కనిపించనున్నాడని లీకైనా ఫోటోలో చూస్తే తెలుస్తుంది.
ఇప్పటి వరకు రామ్ చరణ్ ను చూడని విదంగా శంకర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. చెర్రి ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి , కొడుకులుగా నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రతో చరణ్ నటుడిగా మరింత ఉన్న స్థాయికి చేరుకోవడం పక్కా అని ఇన్సైడ్ టాక్. పొలిటికల్ స్పీచ్ లతో అదరగొడతాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ వేడిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..