Rakul Preet Singh ఒక్కసారిగా మగాళ్ళను రకుల్ అంత మాట అనేసిందేంటి?

- Advertisement -

Rakul Preet Singh టాలివుడ్ లో మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇప్పుడు బాలివుడ్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. అయితే అక్కడ కూడా అందాల ఆరబోతు చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య వార్తల్లో కూడా నిలుస్తుంది.. ఏదొక విషయాన్ని గెలుక్కుంటు వైరల్ అవుతుంది.. ఇకపోతే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మగాళ్ల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తున్నాయి.

Rakul Preet Singh
Rakul Preet Singh

సందీప్ కిషన్ నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్v’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్..ఆ సినిమాలో ఆమె నటనకు, అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ ఒక్క సినిమాతో రకుల్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించేసింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి జరిగింది. అయితే ఇటీవల టాలీవుడ్లో రకుల్ కి అంతగా అవకాశాలు రావడం లేదు. ఆమె తెలుగులో చివరిగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రకుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అక్కడ అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తుంది..

- Advertisement -
Rakul Preet Singh

అయితే ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అయితే రకుల్ ఎవరో స్టార్ హీరోతో కమిట్ అయిందని, ఆ కారణంగానే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని, మరికొందరు బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసిందని, మరికొందరు డ్రగ్స్ తీసుకుంటుందని ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వీటికి స్పందించిన రకుల్ ఇలాంటి ఫేక్ న్యూస్ పట్టించుకునేంత టైం నాకు లేదని చెప్పుకొచ్చింది.. డబ్బుల కోసం అయితే రాకండి.. అంటూ హిత బోధ చేస్తుంది..కష్టపడే తత్వం ఉండాలి అందంగా కనిపించాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఎలాంటి పాత్రనైనా చేయగలగాలి. మరి ముఖ్యంగా మగవాళ్ళ ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉండాలి.

సమాజం ఎంత మారుతున్న మగవాళ్ళ ఆధిపత్యానికి మాత్రం చెక్ పడడం లేదు. ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళదే పై చేయి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. ఆడ మగ సమానం అంటూ పెంచారు… స్టార్ హోదాలోకి రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి అంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలివుడ్ లోనే వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here