మన టాలీవుడ్లో కొంత మంది హీరోయిన్లు అడ్వెంచర్లంటే బాగా ఇష్టపడతారు. స్టార్ హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్‌కు సాహసాలంటే భలే ఇష్టం. ఈ బ్యూటీ తన ఫిట్నెస్ ట్రైనింగ్‌లో కూడా హార్డ్ వర్కవుట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటుంది.
అయితే తాజాగా రకుల్ ఎవరూ ఊహించని పని చేసింది. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు కూడా చేసింది. ఈ పోస్టు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. రకుల్ ధైర్యవంతురాలని తెలుసు కానీ మరీ ఈ రేంజ్ గట్స్ ఉన్నాయని అనుకోలేదని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ చేసిన అడ్వెంచర్ ఏంటో తెలుసా..?
రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అది కూడా ఎముకలు కొరికే చలి ఉండే మంచు ప్రాంతానికి. సాధారణంగా మంచు ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లినప్పుడు అందరూ ఫుల్ లెదర్ జాకెట్స్.. వూల్ దుస్తులు ధరించి చలినుంచి కాస్త జాగ్రత్తపడతారు. కానీ ఈ బ్యూటీ మాత్రం మంచుకొండల్లో బికినీలో రచ్చ చేసింది.
బికినీలో కనిపించడమే కాదు ఏకంగా మైనస్ 15 డిగ్రీల చలిలో ఈ బ్యూటీ బికినీలో కోల్డ్ వాటర్‌లో దిగి జలకాలాడింది. ఈ ప్రాసెస్‌ను క్రయో అంటారని మీకు తెలిసే ఉంటుంది. అవును… రకుల్.. మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్లో కోల్డ్ వాటర్‌లో కాసేపు సేదతీరింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. రకుల్ ఈ ఫీట్ చేస్తున్నప్పుడు అక్కడ తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వారంతా రకుల్ గట్స్‌ను చూసి ఫిదా అయ్యారు.
ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకుల్ మామూలు పిల్ల కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రకుల్ బికినీలో సూపర్ హాట్‌గా ఉందంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ బ్యూటీ హాట్నెస్ ముందు మంచు కూడా కరిగిపోయి ఉంటుంది అంటూ ఫైర్ ఎమోజీస్‌తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.