టాలీవుడ్ హీరోయిన్ Rakul Preet Singh కు గతకొంత కాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు లేవు. ఇదే టైంలో బీ టౌన్ లో వరుస ఆఫర్లు వస్తుండటంతో తన మకాం బాలీవుడ్ కు మార్చింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీబిజీగా గడుపుతోంది. ప్రజెంట్ Rakul Preet Singh ఇల్లు.. ముంబయే అయిపోయింది.
బాలీవుడ్ లో రకుల్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తోంది. దేదే ప్యార్ దే, రన్ వే 34, అయ్యారీ, డాక్టర్ జి, ఛత్రివాలీ.. ఇలా కంటెంట్ బేస్డ్ సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా రకుల్ ఛత్రివాలీ అనే సినిమాలో నటించింది. శృంగారం విషయంలో అవగాహన కల్పించే టీచర్ పాత్రలో రకుల్ బోల్డ్ రోల్ చేసింది. ఈ చిత్రంలో కండోమ్ తరహా అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రకుల్ తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తాను ఇండస్ట్రీకి వచ్చినప్పటి తొలిరోజుల గురించి మాట్లాడింది. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో పూసగుచ్చినట్టు చెప్పింది. ఇంకా ఈ ఇంటర్వ్యూలో రకుల్ ఏం చెప్పిందంటే..
నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. నా ట్రైనర్ తో కలసి బాంద్రాలోని ఒక కేఫ్ లో కుర్చునేదాన్ని. ఏవైనా ఆడిషన్స్ ఉంటే వెంటనే వెళ్లొచ్చని అక్కడకి వెళ్లేదాన్ని. కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కారులోనే బట్టలు మార్చుకునేదాన్ని. కొన్ని సార్లు ఆఫర్స్ వచ్చేవి. వెంటనే చేజారేవి. కొన్ని చిత్రాల్లో షూటింగ్ జరిగిన తర్వాత కూడా నన్ను తప్పించి మరో హీరోయిన్ ని తీసుకునేవారు. అప్పుడు చాలా బాధగా అనిపించేది అని రకుల్ వివరించింది.
వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నటుడు, నిర్మాతతో ప్రేమలో పడింది. కొంతకాలంగా వీళ్లిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. బీ టౌన్ లో ఏ ఫంక్షన్ కు వెళ్లినా.. ఈవెంట్ కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తుంది. ఇక తరచూ వెకేషన్లకు కూడా వెళ్తుంటారు.