సినిమాలకు గుడ్ బై చెప్పనున్న రజినీకాంత్.. ఇదే లాస్ట్ మూవీనా?

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎంతమంది అభిమానులు ఉన్నారో లెక్కపెట్టి చెప్పడం కష్టమే.. రజినీకాంత్ సినిమాలు తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఇక్కడ కూడా వీరాభిమానులు ఉన్నారు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. 72 సంవత్సరాల ఆయన ఎక్కువగా సినిమాలే ఊపిరిగా బ్రతికారు.. ఇప్పుడు వయస్సు మీద పడటంతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. రజనీ ఇప్పుడు తన 169వ సినిమా ‘జైలర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దీనికి దర్శకుడు. మరోవైపు తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి లేదా టీజె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది..

రజినీకాంత్
రజినీకాంత్

అయితే అదే రజినీ కెరీర్లో చివరి సినిమా అవుతుందని తమిళ డైరెక్టర్ మిస్కిన్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది..ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రజినీ, లోకేష్ కాంబినేషన్ పై స్పందించాడు. తలైవర్ తో లోకేష్ సినిమాని ధ్రువీకరించిన మిస్కిన్.. యువ దర్శకుడి పట్ల తాను చాలా సంతోషంగా గర్వంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు లోకేష్ తో సినిమా చేయడం కోసం రజనీయే ఆసక్తి చూపారని.. సినిమా చేద్దామని స్వయంగా అడిగినట్లుగా చెప్పారు. తనకు వంద శాతం కచ్చితంగా తెలియనప్పటికీ, అది రజినీ కాంత్ కు చివరి సినిమా అని విన్నట్లుగా మిస్కిన్ తెలిపారు..

డైరెక్టర్ మిస్కిన్ కామెంట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో కోలీవుడ్ సూపర్ స్టార్ లాస్ట్ మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. 50 దశాబ్దాల సినీ కెరీర్ కు రజినీ తన 171వ సినిమాతో గుడ్ బై చెబుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది తలైవా చివరి సినిమా అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, రజనీ,లోకేష్ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఎటువంటి కథతో వస్తుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇదే చివరి సినిమా కావడంతో బాధపడుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here