Rajinikanth : రజినీకాంత్ మాములోడుకాదు..ఇప్పటికీ దాని కోసం వెయిటింగ్..Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు..ఆయన స్టైల్, నటన, డాన్స్ ఇలా ఒకటేమిటి ఎన్నో జనాలను ఆకట్టుకున్నాయి.దాంతో ఆయనను సూపర్ చేశారు..ఇక స్క్రీన్ పై ఎంత అందమైన అమ్మాయి అయినా ఈయన వెనుక పడాల్సిందే.. దేశం మొత్తాన్ని తన జపంలో ముంచేయగల రజినీకాంత్ నిజజీవితంలో భగ్న ప్రేమికుడన్న విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ప్రేమించిన అమ్మాయిని మరొకసారి చూడాలనే ఆశతో ఇప్పటికీ పరితపిస్తున్నాడని చెబితే ఎవరైనా నమ్మగలరా.రజినీకాంత్ ను సూపర్ స్టార్ అవ్వడానికి ప్రేరేపించిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..ఇక ఆలస్యం ఎందుకు ఎవరో చూద్దాం రండి..

Rajinikanth
Rajinikanth

ఇండస్ట్రీలోకి రాకముందు బెంగళూరులో బస్ కండక్టర్గా ఉద్యోగం చేసే రోజుల్లో ఎంబీబీఎస్ చదివే ఒక అమ్మాయి తరచుగా రజనీకాంత్ డ్యూటీ చేసే బస్సులోనే ఎక్కువగా ప్రయాణం చేసేదట. వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతేకాదు అదే సమయంలో తాను నటించే ఒక నాటకానికి ఆ అమ్మాయిని రజనీకాంత్ ఆహ్వానించారట. అనంతరం కొన్ని రోజులకు రజనీకాంత్ కి చెన్నైలోని అడయార్ ఇన్స్టిట్యూట్ కి రావాల్సిందిగా ఒక లెటర్ వచ్చింది. వాస్తవానికి అది ఎవరూ అప్లై చేశారో కూడా తెలియదు..

Super Star Rajinikanth

ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ విషయాన్ని గురించి అడిగిందట..నువ్వు సూపర్ స్టార్ హీరో అవ్వాలి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిందట ఆ అమ్మాయి. కొద్దిసేపటి తర్వాత రజనీకాంత్ ఆలోచించి.. వెళ్ళవచ్చు కానీ అక్కడ ఉండడానికి , ఖర్చులకు చాలా డబ్బులు అవసరం అవుతాయి. అంత డబ్బు నా దగ్గర లేదు.. అని అన్నారట . వెంటనే అప్పటికప్పుడు ఆ అమ్మాయి రూ. 500 ఇచ్చి నీకున్న టాలెంట్ కి నువ్వు నటనలో ఎంతో ఎత్తుకు ఎదగగలవు . ప్రపంచంలోనే గొప్ప నటుడు అయ్యే సత్తా నీలో ఉంది. నీ పోస్టర్లు, కటౌట్లను నేను ఇక్కడ చూడాలి. నువ్వు కచ్చితంగా వెళ్లాల్సిందేనని పట్టు పట్టింది..దాంతో అతను వెల్లాల్సి వచ్చింది..

Rajinikanth Movies

రజనీకాంత్ చెన్నై వెళ్లాక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని అడిగితే.. అక్కడే జాయిన్ అయ్యి.. ఆ తర్వాత ఆదివారం రజనీకాంత్ అమ్మాయిని చూడడానికి బెంగళూరుకి వచ్చారు. ఎన్ని రోజులు ఎదురు చూసిన ఆ అమ్మాయి కనిపించలేదు. దీంతో కొంతమంది ఫ్రెండ్స్ ను వెంటబెట్టుకొని బెంగళూరులో ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించి.. ఇంటికి వెళ్ళగా తాళం వేసి కనిపించింది.

పక్కింటి వాళ్ళు అడిగితే వారం క్రితమే ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారట. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ అమ్మాయి రాక కోసం రజనీకాంత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది..ఈ విషయాన్ని ఓ నటుడు బయట పెట్టారు..అతను నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది..