Guess The Actress : ‘ఢీ’ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని నేడు సినిమాల్లో హీరోలకు దడపుట్టించే క్రేజ్ ని సాధించిన ఈ బుడ్డది ఎవరో గుర్తుపట్టారా..?

- Advertisement -

Guess The Actress : ఈ క్రింది ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? , ఈమె ఫాలోయింగ్ ముందు కొంతమంది హీరోలు కూడా బయపడుతారు. డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అనేది అసలు చూడరు.కేవలం ఈమె పోస్టర్ కనిపిస్తే చాలు టికెట్స్ చింపుతారు.అందం తో కాకుండా టాలెంట్ తో అశేష ప్రేక్షాభిమానం సొంతం చేసుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్.

Guess The Actress
Guess The Actress

ఈమెతో డ్యాన్స్ వేయాలంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లాంటి హీరోలకు కూడా భయమే. నెమలి నాట్యం చేస్తే ఎంత అందం గా ఉంటుందో, ఈమె నాట్యం చేస్తే అలా ఉంటుంది.అందుకే ఆమెకి యూత్ లో అంతటి క్రేజ్ మరియు ఫాలోయింగ్. ఈమెకి ఉన్న ఆ ఫాలోయింగ్ ని చూసి అందరూ ఈమెని ‘లేడీ పవర్ స్టార్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. లేడీ పవర్ స్టార్ అని చెప్పగానే మీ అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది మేము మాట్లాడుతుంది సాయి పల్లవి గురించి అని.

ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ గేమ్ షో ‘ఢీ’ లో ఒక డ్యాన్స్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. తన అద్భుతమైన డ్యాన్స్ తో ఆమె ఆ షో లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. ఈమె టాలెంట్ ని చూసి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి, అలా మలయాళం లో ‘ప్రేమమ్’ అనే సినిమా ద్వారా వెండితెర పై మొట్టమొదటి సారి కనిపించింది. ఆ తర్వాత తెలుగు లో ‘ఫిదా’ చిత్రం లో నటించి తిరుగులేని క్రేజ్ ని సంపాదించింది.

- Advertisement -

ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయం లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. క్రేజ్ ఉంది కదా అని ఇష్టమొచ్చిన సినిమాలు చెయ్యకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ కెరీర్ ని ముందుకు సాగిస్తుంది. ఆమె రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందో చూడాలి. ఈమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here