Rajinikanth : ఆ బాలీవుడ్ హీరోయిన్ తో రజనీకాంత్ చేసిన పనికి షాక్ అయిన ఇండస్ట్రీ



Rajinikanth : బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ను రజనీకాంత్‌ సర్‌ప్రైజ్‌ చేశాట. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే చెప్పింది. ఇంతకి ఏం జరిగిందంటే. కంగనా-ఆర్‌ మాధవన్‌ దాదాపు ఏనిమిదేళ్ల తర్వాత మరోసార జతకడుతున్నారు. తను వెడ్స్‌ మను సినిమాతో అలరించిన వీరిద్దరు ఇప్పుడు సైకాలజీకల్‌ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే విషయాన్ని కంగనా ఫ్యాన్స్‌తో పంచుకుంది.

ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ రోజు నా కొత్త సినిమా ప్రారంభమైంది. చెన్నైలో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. ఆర్‌ మాధవన్‌తో కలిసి ఓ సైకాలజీకల్‌ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాను. ఈరోజే షూటింగ్‌ కూడా మొదలైంది’ అని తెలిపింది. అలాగే తన మూవీ ఫస్ట్‌డే షూటింగ్‌ సెట్‌లోనికి భారత సినిమా దేవుడుగా పిలిచే తలైవా రజనీకాంత్‌ స్వయంగా వచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇది మా అందరికి మర్చిపోలేని రోజు. కానీ మ్యాడీ(మాధవన్) మాత్రం మిస్‌ అయ్యారు. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు’ అని కంగనా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Rajinikanth
Rajinikanth

ఈ సందర్భంగా మూవీ యూనిట్‌తో రజనీకాంత్‌ దిగిన ఫొటోను, తలైవా తనకు బొకే ఇచ్చి విష్‌ చేసిన ఫొటోను షేర్‌ చేస్తూ కంగనా ఆనందం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.