Rajinikanth: ఆ స్టార్ హీరోని రజినీకాంత్ కూతురు రెండవ పెళ్లి చేసుకోబోతుందా..?

- Advertisement -

Rajinikanth: టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్..ఇలా ఎక్కడ చూసిన ఈమధ్య కాలం లో పెళ్లిళ్ల వార్తల కంటే కూడా విడాకులు తీసుకుంటున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎంతో ఘాడం గా ప్రేమించుకున్న ఈ ప్రేమికులు చిన్న చిన్న కారణాలతోనే విడాకులు దాకా తెచ్చుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Rajinikanth
Rajinikanth

రీసెంట్ తమిళ క్రేజీ హీరో ధనుష్ – ఐశ్వర్య విడాకులు కూడా అలాంటిదే. వివాహం జరిగి , దశాబ్దం కి పైగానే దాటి, చెట్టంత కొడుకులు ఉన్నప్పటికీ కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం రీసెంట్ టైం లో సంచలనం కి గురి చేసిన విషయం. ఐశ్వర్య సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూతురు అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ధనుష్ కి తన కెరీర్ ప్రారంభం లో కోలీవుడ్ లో రజినీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ ఇమేజి బాగా ఉపయోగపడింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం మామా అల్లుడు లాగ కాకుండా తండ్రి కొడుకులు లాగ ఉంటారు.

వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత రజినీకాంత్ వీళ్ళని కలపడానికి చాలా ప్రయత్నాలే చేసాడు కానీ వీళ్లిద్దరు కలవడానికి ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై లోని ఒక ప్రముఖ రిసార్ట్ తో వీళ్లిద్దరు కలిసి కనిపించడం తో ఈ రూమర్స్ కి పురుడు పోసుకుంది.

- Advertisement -

ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఐశ్వర్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే రజినీకాంత్ ఫ్యాన్స్ నుండి రియాక్షన్ ఎలా ఉంటుంది?, పాజిటివ్ గా ఉంటుంది, నెగటివ్ గా కూడా ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ చేసుకుంటే కూడా అందులో ఎలాంటి తప్పు లేదని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత మన కాస్త సుఖాలు పంచుకోవడానికి కచ్చితంగా ఒకరు కావాలి. మగవాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్లు చేసుకోవడం లో తప్పేమి ఉంది, కాబట్టి ఐశ్వర్య రెండవ పెళ్లి చేసుకోవడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. మరి ఆమె పెళ్లి చేసుకోబొయ్యేది ఎవరో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here