Rajasekhar : అంటేనే పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ఆయన గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంకుశం చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. చిరంజీవి ,వెంకటేష్, బాలకృష్ణ ,నాగార్జున వంటి స్టార్ హీరోలతో పోటీగా రాజశేఖర్ చిత్రాలు నిలిచేవి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజశేఖర్ భార్య అయిన జీవిత కూడా ఒకప్పుడు హీరోయిన్.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు కూడా సినిమాల్లోకి ప్రవేశించారు. వింత ఏమిటంటే రాజశేఖర్ జీవితల పెళ్లి ఒక వింతలా జరిగింది. రాజశేఖర్ మొదట జీవితను తన పక్కన హీరోయిన్ గా కూడా వద్దన్నాడట. ఆమెని హీరోయిన్ గా తీసుకున్నట్లయితే తాను నటించనని చెప్పాడట. రాజశేఖర్ జీవితల కాంబినేషన్లో ఒక చిత్రం తీద్దామని దర్శక నిర్మాతలు అనుకున్నప్పుడు, ఆమె నాకు నచ్చలేదు ,అని చెప్పారట రాజశేఖర్. కానీ ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని చిత్రాల్లో కలిసి నటించడం వల్ల, వారిద్దరి మధ్య స్నేహం పెరిగి ,అది కాస్తా ప్రేమకు దారి తీసింది.
అంతేకాకుండా ఒక చిత్రంలో నటిస్తున్న టైం లో రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగింది. జీవిత సొంత భార్యలా హాస్పిటల్లో ఉండి రాజశేఖర్ కు అన్ని దగ్గరుండి సపర్యలు చేసింది. ఇది చూసిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు జీవితను తమ కోడలిగా భావించారట. సినిమాలో హీరోయిన్ గానే వద్దన్న రాజశేఖర్ చివరికి ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడట. జీవిత రాజశేఖర్ తో పెళ్లయినప్పటి నుండి అతనికి మార్గదర్శకురాలుగా ఉండి ఆయన సక్సెస్ లో భాగస్వామి అయ్యింది.