Bhola Shankar నుండి మరో చార్ట్ బస్టర్ సాంగ్.. ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ వచ్చే నెల 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘భోళా మేనియా’ లిరికల్ వీడియో సాంగ్ మరియు టీజర్ కి ఫ్యాన్స్ నుండి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మెహర్ రమేష్ నుండి ఈ రేంజ్ ఔట్పుట్ అభిమానులు ఇంతకు ముందు ఊహించలేదు.

Bhola Shankar
Bhola Shankar

వరుస ఫ్లాప్స్ ఇస్తున్న డైరెక్టర్ తో రీమేక్ సినిమా చేస్తున్నాడు అని ‘భోళా శంకర్’ పై చాలా తీవ్రమైన నెగటివిటీ ఉండేది. అయితే ఆ నెగటివిటీ మొత్తం ఇప్పుడు వరుసగా విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ ద్వారా పాజిటివ్ గా మారిపోయింది. ఇక పోతే ఈ సినిమా నుండి మరో లిరికల్ వీడియో సాంగ్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. మరి ఈ సాంగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

Bhola Shankar
Bhola Shankar

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కొడుకు మహతి సాగర్ వ్యవహరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే, మొదటి పాట తోనే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక సినిమాలోని సంగీత్ కార్యక్రమం లో వచ్చే పాట అయినా ‘జామ్ జామ్ జజ్జనక’ పాట కి కూడా అద్భుతమైన బాణీలు అందించాడు. ఈ పాటలో చిరంజీవి తో పాటు సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు చిందులు వెయ్యడం ఒక పండుగ వాతావరణం ని తలపించింది.

- Advertisement -
Bhola Shankar Dubbing

మరో విశేషం ఏమిటంటే ఈ పాటలో ప్రముఖ హీరో సుశాంత్ చిరంజీవి తో సమానంగా డ్యాన్స్ వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం లో కూడా ఈయన అల్లు అర్జున్ తో సమానంగా డ్యాన్స్ వేసాడు. సాధారణంగా ఒక పాట మొదటి సారి వినగానే ఆడియన్స్ కి నచ్చదు. కానీ ‘భోళా శంకర్‘ నుండి విడుదలైన రెండు పాటలు కూడా మొదటిసారి విన్నప్పుడే ఆడియన్స్ కి నచ్చేసింది, ఈ పాటలు సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతాయి అనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here