ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు Rajamouli అనే వ్యక్తి తిరుగులేని బ్రాండ్.అంచలంచలుగా ఎదుగుతూ తనతో పాటు మన తెలుగు సినిమాని కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాడు. బాహుబలి సిరీస్ తో నేషనల్ లెవెల్ లో మన తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి #RRR చిత్రం తో మన స్థాయిని అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కేలా చేసాడు.
‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో నామినేషన్ దక్కించుకున్న ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనేది మార్చి 12 వ తేదీన తెలియనుంది.తనకంటూ ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేని రేంజ్ ని ఏర్పాటు చేసుకున్న రాజమౌళి, ఆ రేంజ్ ని ఇప్పుడు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఎప్పుడో ‘యమదొంగ’ సమయం లో ‘విశ్వామిత్ర’ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారిన రాజమౌళి ఆ తర్వాత ఎందుకో మళ్ళీ ప్రొడక్షన్ వైపు పోలేదు.
ఒకేసారి దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఒత్తిడి తీసుకోలేనని అనుకున్నాడో ఏమో కానీ,నిర్మాణం వైపు మాత్రం ‘యమదొంగ’ తర్వాత చూడలేదు.కానీ ప్రస్తుతం ఇప్పుడున్న దర్శకులు రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు.త్రివిక్రమ్ ,సుకుమార్ వంటి దర్శకులు చేస్తున్నది ఇదే. ఇవన్నీ గమనించిన రాజమౌళి ఇక నుండి తాను దర్శకత్వం వహించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. తనకి ఉన్న గ్లోబల్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చెయ్యబోతున్నాడు. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సినిమా కి KS రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పుడు రాజమౌళి కూడా తన ‘విశ్వామిత్ర బ్యానర్’ ని రీ యాక్టీవ్ చేసి సహా నిర్మాతగా మారబోతున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. మరి ఇందులో రాజమౌళి వాటా ఎంత ఉంటుందో తెలీదు కానీ, ఆయన కూడా భారీ ఎత్తున ఇందులో పెట్టుబడి పెట్టబోతున్నాడట.మరి రాజమౌళి ఎప్పటిలాగానే ఈ సినిమాతో కూడా సక్సెస్ కొట్టి లాభాలను మూటగట్టుకుంటాడా..? , లేదా చెయ్యి కాల్చుకుంటాడా అనేది చూడాలి.