రాజమౌళి దర్శకత్వం లో అక్కినేని అఖిల్..భారీ మొత్తం లో అడ్వాన్స్ ఇచ్చిన నాగార్జున

- Advertisement -

అక్కినేని కుటుంబం నుండి స్టార్ హీరో రేంజ్ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో అక్కినేని అఖిల్. మనం సినిమా క్లైమాక్స్ లో ఒక 2 నిమిషాలు వెండితెర మీద కనిపిస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి. ఆ తర్వాత మొదటి సినిమా ‘అఖిల్ – ది పవర్ ఆఫ్ జువ్వ’ కి అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, చివరికి కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ గా మిగిలింది.

అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

ఆ తర్వాత వచ్చిన ‘హలో’ చిత్రం ఒక మోస్తరుగా ఆడినప్పటికీ, అఖిల్ నుండి అభిమానులు కోరుకున్న రేంజ్ హిట్ మాత్రం కాలేకపోయింది. ఆ తర్వాత విడుదలైన మిస్టర్ మజ్ను డిజాస్టర్ అవ్వగా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ చిత్రం హిట్ గా నిల్చింది.ఇక భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ చిత్రం తో టాప్ లీగ్ లోకి అడుగుపెడతాడు అనుకుంటే, ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.

Akkineni Akhil

ఇప్పుడు అఖిల్ కి కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావలి, లేదంటే మనుగడ కష్టం అని ఫ్యాన్స్ అభిప్రాయం, సోషల్ మీడియా లో కూడా అక్కినేని ఫ్యాన్స్ నుండి హీరోలపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇదంతా గమనించిన నాగార్జున రీసెంట్ గానే రాజమౌళి ని కలిసి అఖిల్ తో ఒక సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడట. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు.

- Advertisement -
Akhil Rajamouli

ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. ఈ ఏడాది లోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రం పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది, ఈ సినిమా పూర్తి అవ్వగానే తన తదుపరి చిత్రం అక్కినేని అఖిల్ తోనే ఉంటుందని రాజమౌళి నాగార్జునకి మాట ఇచ్చాడట. దీంతో రాజమౌళి కి నాగార్జున అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అక్కినేని ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ ని నింపుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here