Raashi Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో మరోసారి సొగసుల బాంబ్ విసిరింది. ఈ భామ రచ్చ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ బ్యూటీ ఔట్ఫిట్ కంటే ఎక్కువగా ఆ ఫొటోల కింద తను ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. బాయ్‌ఫ్రెండ్ క్లోజెట్ నుంచి తీసుకున్నాను.. ట్రెండీగా కనిపించాలని అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ క్యాప్షన్ చూసి నెటిజన్లు అదేంటి.. రాశీకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. రాశీ ఖన్నా బాయ్ ఫ్రెండ్ అంటూ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. కానీ ఎవరూ లేరని తెలిసి చివరకు కూల్ అవుతున్నారు.

క్లాసీ లుక్‌లో ఫొటోలు పోస్ట్ చేసిన రాశీ ఖన్నా అబ్బాయిలు ధరించేటువంటి సూట్ వేసుకుంది. అందుకే బాయ్ ఫ్రెండ్ డ్రెస్ వేసుకున్నా అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేసింది. కానీ ఈ క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు తెర తీసింది. రాశీ ఖన్నా మాత్రం తన లైఫ్‌లో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క లవ్.. సినిమాలు అంటూ ఈ రూమర్స్‌కు స్మైల్‌తో చెక్ పెట్టేస్తుంది. ఇక ఈ లుక్‌లో మాత్రం రాశీ సూపర్ క్లాసీగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక రాశీ ఖన్నా సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ ఇటీవలే యోధ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకలను అలరించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ది సబర్మతి రిపోర్ట్, తెలుసు కదా, సర్దార్-2 సినిమాలు ఉన్నాయి. ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ చాలా బిజీ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో చివరగా థాంక్యూ సినిమాతో అలరించింది.
View this post on Instagram