Raashi Khanna : టాలీవుడ్ లో గ్లామర్ తో పాటుగా అద్భుతమైన నటన చూపించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రాశి ఖన్నా. కేవలం హీరోల పక్కన డ్యాన్స్ లు వెయ్యడానికి మాత్రమే కాదు, కథలో దమ్ము తన పాత్ర కాస్త ఛాలెంజ్ గా ఉంటేనే ఈమె ఏ సినిమా అయినా చెయ్యడానికి ఒప్పుకుంటుంది..ఆమె ఫిల్మోగ్రఫీ మొత్తం చూస్తే అది మనకి చాలా తేలికగా అర్థం అయిపోతుంది..అందుకే రాశి ఖన్నా యూత్ లో అంత క్రేజ్ ఉంటుంది.

నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా రాశి ఖన్నా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడింది.అలా సుమారుగా తెలుగు తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి సుమారుగా 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..వాటిల్లో అధిక శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

గత ఏడాది ఈమె తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి సర్దార్, పక్కా కమర్షియల్ , తిరు చిత్రంబలం మరియు థాంక్యూ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.వీటిల్లో థాంక్యూ అనే చిత్రం తప్ప మిగిలిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి.

హీరోయిన్ గా ఆమె రేంజ్ ని మరింత పెంచాయి ఈ చిత్రాలు.. అయితే రాశి ఖన్నా కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు, రాశి ఖన్నా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది..ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే అలా చూస్తూ రోజు మొత్తం గడిపేస్తాం..అంత కలర్ ఫుల్ గా ఉంటుంది.. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన కొన్ని రాశి ఖన్నా ఫోటోలు సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తున్నాయి.


