Pushpa 2 : ఒక్క టీజర్ తో 1000 కోట్ల రూపాయిల బిజినెస్.. అల్లు అర్జున్ రేంజ్ ఊహాతీతం!

- Advertisement -

Pushp 2 : రాజమౌళి సపోర్టు లేనిదే మన తెలుగు స్టార్ హీరోలకు పాన్ ఇండియా స్టార్ ఇమేజి రాదనీ కొంతమంది విశ్లేషకులు అంటుండేవారు.కానీ రాజమౌళి సహాయం లేకుండా కేవలం టాలెంట్ తో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.ఇతర రాష్ట్రాలలో ప్రస్తుతం రాజమౌళి తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ చాలా గొప్పది,అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు ఆయన ‘పుష్ప’ సినిమాతో.

Pushpa 2
Pushpa 2

ఈ చిత్రం మన తెలుగు లో కంటే కూడా ఇతర బాషలలోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.హిందీ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది.అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే ఇక క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

పైగా ఇప్పుడు నార్త్ ఇండియా లో సీక్వెల్స్ కి ఉన్న డిమాండ్ మామూలు రేంజ్ కాదనే చెప్పాలి.అందుకు ఉదాహరణగా ‘బాహుబలి 2’ మరియు ‘KGF 2’ సినిమాలను తీసుకోవచ్చు.ఈ రెండు సినిమాలే ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 2 చిత్రాలుగా నిలిచాయి.ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని టార్గెట్ చేయబోతుంది పుష్ప 2..ట్రేడ్ కూడా ఈ సినిమా బాహుబలి 2 రేంజ్ లో సక్సెస్ సాదిస్తుందని బలంగా నమ్ముతుంది.

- Advertisement -

ఇక ఈరోజు విడుదల చేసిన ప్రీ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుండే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభం ఐపోయినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థ ‘పుష్ప 2‘ కి సంబంధించి థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ , ఆడియో రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ వీటి అన్నిటికీ కలిపి వెయ్యి కోట్ల రూపాయిల ఫ్యాన్సీ ఆఫర్ ని మైత్రీ మూవీ మేకర్స్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. దీనికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here