Punarnavi : మరోసారి తెరపైకి పునర్నవి ప్రగ్నెంట్ వార్తలు

- Advertisement -

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం ( Punarnavi ) గురించి పరిచయం అవసరం లేదు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో మెరిసిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని యూత్ ని ఆకర్షించింది. ఆ తర్వాత సినిమాలకు, సిరీస్ లకు గుడ్ బాయ్ చెప్పేసి లండన్ వెళ్లిపోయింది. ఇక ఈ భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్ డేట్ ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి పునర్నవి ప్రెగ్నెంట్ అనే వార్తలు తెరపైకి వచ్చాయి.

punarnavi
punarnavi

గతంలో పునర్నవి పోస్ట్ చేసిన ఓ ఫోటోలో ఆమె కాస్త బొద్దుగా ఉండడంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు హల్ చల్ చేసింది. ఈ వార్తలు నిజం కాదంటూ ఆమె స్పందించిందనీ అప్పట్లో అన్నారు. ఇక తాజాగా పునర్నవి ప్రగ్నెంట్ అనే వార్త నెట్టింట వైరలవుతోంది. దీనికి కారణం ఆమె పెట్టిన ఫొటోలు మరోసారి కాస్త బొద్దుగా కనిపించడమే. ఆ పోస్ట్కు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు ప్రెగ్నెంటా’ అని ఆమెనే ప్రశ్నిస్తున్నారు. మరి మరోసారి ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

punarnavi Photos

ఇక పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు గుప్ మన్నాయి. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ఒక స్నేహితుడిగానే ఇప్పటికి ఆమెతో టచ్ లో ఉన్నాను అని తెలిపాడు. ఇటీవల పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ కొన్ని పిక్స్, రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనితో తెరపైకి రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా వచ్చింది అని యాంకర్ ప్రశ్నించగా.. అయినా పునర్నవి గర్భవతి ఏంటి.. అలా ఏమి ఉండదు అని నవ్వేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here