Fahadh Faasil .. పుష్ప సినిమాలో విలన్. భన్వర్ సింగ్ షెకావత్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అయితే మలయాళం డబ్బింగ్ చిత్రాలు చూసే తెలుగు వాళ్లకు మాత్రం ఫహాద్ గురించి బాగా తెలుసు. ఆయన నటనకు చాలా మంది ఫిదా అవుతుంటారు. యాక్టింగ్ లో సాధారణంగానే మలయాళం నటులు టాప్ రేంజ్ లో ఉంటారు. అలాంటి వాళ్లలో ఫహాద్ కూడా ఉంటాడు.

తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫహాద్ కేవలం హీరోగానే నటించడు. తన పాత్ర ఆ సినిమాకు బలం అనిపించినా.. తన కెరీర్ లో అలాంటి క్యారెక్టర్ చేయలేదనిపించినా.. ఓకే చెప్పేస్తాడు. అలా ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. హీరో ఫహాద్ కు వంక పెట్టలేం.. కానీ విలన్ ఫహాద్ వేరే లెవల్. విలన్ రోల్ లో యాక్టింగ్ దుమ్ము లేపుతాడు. ఇప్పుడు పుష్ప-2లోనూ తన విలనిజం ఓ రేజ్ లో ఉండబోతోందని టాక్.
తాజాజా ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మూవీ లవర్స్ ను కాస్త ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తమకు ఫహాద్ అంటే చాలా గౌరవం అని, చాలా చాలా ఇష్టమని, ఆయన యాక్టింగ్ వీరాభిమానులం అని.. కానీ తాజాగా చేసిన ఆయన కామెంట్స్ మాత్రం తీసుకోలేకపోతున్నామని అంటున్నారు. ఫహాద్ లేటెస్ట్ కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?
సినిమా అనేదే ముఖ్యం కాదు.. ఇంకా జీవితంలో చాలా ఉన్నాయి. సినిమా అప్రోచ్ మారాలని నేను అనుకుంటున్నాను. ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద కూడా సినిమా గురించి డిస్కషన్ అవసరం లేదని నా అభిప్రాయం. థియేటర్ లో లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వరకు మాత్రమే మాట్లాడుకోవాలి. అంతే చాలు. సినిమా ఏమి అంతకు మించి కాదు. సినిమాకు కూడా లిమిట్స్ ఉన్నాయి. సినిమా కాకుండా జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి” అంటూ కామెంట్ చేశారు. ఇక ఫహాద్ కామెంట్స్ ను కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరేమో ఫైర్ అవుతున్నారు. ‘మా ఫేవరెట్ నటుడు ఇలాంటి కామెంట్స్ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నామంటూ’ ఫీల్ అవుతున్నారు. “ఇప్పుడేంటి.. మా జీవితం మేం చూసుకోవాలి అని చెప్తున్నారా? ఫాఫా” అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.