Pushpa 2 : జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తోపాటు..సంస్థ ప్రతినిధులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఐటీ దాడుల నేపథ్యంలో ఇవాళ ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేశారు. మైత్రి మూవీస్ నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆఫీస్ కి తాళం వేసి, బయట వ్యక్తులను లోపలికి, లోపలి వ్యక్తులను బయటకు ఐటీ అధికారులు అనుమతించడం లేదు.

ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన ఎన్‌ఆర్‌ఐలుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. GST నిబంధనలను ఉల్లంఘించినందుకు, వారి ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITRs) తప్పుడు వివరాలను అందించారని ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ నివాసాలు, కార్యాలయ ప్రాంగణాల్లో గత ఏడాది డిసెంబర్‌లో వస్తు సేవల శాఖ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ లు కావడంతో పాటుగా ఇప్పుడు పుష్ప 2 సినిమాను కూడా భారీ ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో ఐటీ రాడార్ దృష్టిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో పుష్ప2 సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

‘తగ్గేదే లే’, ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’.. ఇలా చెబుతూ వెళితే ఆ సినిమాలో ఎన్నో సంభాషణలు అభిమానులను అలరించాయి. దీంతో ‘ పుష్ప-2 ’లోనూ పవర్‌ఫుల్ డైలాగ్స్ మెండుగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లోని ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం’’. ప్రస్తుతం ఈ డైలాగ్ సినీ ప్రియులతో ఈలలు వేయిస్తోంది.