Keerthy Suresh : కాటుక కళ్లతో కనికట్టు.. కీర్తి అందం చూసి మతి పోతోందంటూ నెటిజన్ల కామెంట్లు

- Advertisement -

Keerthy Suresh మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దసరా సినిమా సక్సెస్​ జోష్​లో ఉన్న బ్యూటీ కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది. దసరా సినిమా తర్వాత కీర్తి చేసిన ఫస్ట్ పోస్టు ఆ సినిమా ప్రమోషన్స్​లో తన లుక్ గురించే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబయి.. ఇలా పలు నగరాలకు వెళ్లారు. ఈ చిత్ర ప్రచారం కోసం కీర్తి ట్రెడిషనల్ లుక్​ను ఎంచుకుంది. అందుకే ఎక్కువగా చీరకట్టులోనే కనిపించింది.

Keerthy Suresh
Keerthy Suresh

దసరా మూవీ ప్రమోషన్స్​లో తనకు బాగా నచ్చిన తన అట్టైర్​ గురించి సోషల్ మీడియాలో కీర్తి తాజాగా పోస్టు చేసింది. ‘దసరా సినిమా ప్రమోషన్స్​లో నాకు బాగా నచ్చిన లుక్’ అంటూ కీర్తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కీర్తి చాక్లెట్ కలర్ శారీలో కనిపించింది. చీరకట్టులో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. కాటుక కళ్లతో.. మత్తెక్కించే చూపులతో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేసింది. నడుం అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కవ్వించే పోజులతో.. క్యూట్ స్మైల్​తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh Photos

కీర్తి లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో కీర్తి స్టన్నింగ్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే అంటూ పాటలు పాడుకుంటున్నారు. లవ్యూ కీర్తి అంటూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. దసరా సినిమాలో డీ గ్లామర్ లుక్​లో కనిపించిన కీర్తిని గుర్తు చేసుకుంటూ.. విత్ ఆర్ వితౌట్ మేకప్.. ఎలాగైనా కీర్తి అందంగానే కనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
Keerthy Suresh Latest photos
KeerthySuresh

ఇక దసరా మూవీ ఇచ్చిన కిక్​తో కీర్తి సురేష్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇటీవల వరుస ఫ్లాప్​లతో సతమతమవుతున్న కీర్తికి దసరా బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సెస్ సాధించింది. మిగతా భాషల్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి కీర్తి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ సక్సెస్​ను కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here