యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం అర్జెంటు గా ఒక సూపర్ హిట్ కావాలి. ఎందుకంటే బాహబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అన్నీ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరుపుకున్నాయి. ఫలితంగా వందల కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు ఆయన అభిమానులు మొత్తం ‘సలార్’ చిత్రం మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ప్రభాస్ లైనప్ లో ‘సలార్’ కంటే ఎక్కువగా ‘కల్కి’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ని జోడించి ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని రీసెంట్ గా విడుదలైన టీజర్ ని చూస్తే ఎవరికైనా అర్థం అవుతాది. ప్రభాస్ ఇందులో శ్రీ మహావిష్ణవు ఆఖరి అవతారం కల్కి గా కనిపించబోతున్నాడు.
ఈ చిత్రం లో ప్రభాస్ తో పాటుగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పాడుకొనే వంటి వారు కూడా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం లో అశ్వద్దామా పాత్రని పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి హీరోగా మొదటి ఛాయస్ ప్రభాస్ కాదట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఈ పాత్ర కోసం అనుకున్నారు. కానీ రాజమౌళి #RRR చిత్రం కి కమిట్ అవ్వడం వల్ల అప్పట్లో ఈ చిత్రానికి కమిట్మెంట్ ఇవ్వలేదు.

అలా రామ్ చరణ్ #RRR చిత్రం కోసం ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేతులారా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. #RRR చిత్రం తర్వాత ఈ సినిమా రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయేది,పాపం బ్యాడ్ లక్. అయితే ఈ చిత్రమైన ప్రభాస్ అభిమానుల ఆకలిని తీరుస్తుందా లేదా అనేది చూడాలి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
