హీరోయిన్ మీనా పడుకున్న మంచంతో కోట్ల రూపాయిలు సంపాదించిన నిర్మాతలు..అందులో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే!

- Advertisement -

బాలనటిగా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మీనా, ఆ తర్వాత హీరోయిన్ గా మారి హిట్ మీద హిట్ కొడుతూ ఇండస్ట్రీ లో అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు తో పాటుగా తమిళం లో కూడా ఈమె పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలు ఎక్కువ శాతం కమర్షియల్ గా సూపర్ హిట్స్ గా నిలిచినవే.

ఈమె గ్లామర్ పాత్రలు చెయ్యగలదు, అలాగే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చెయ్యగలదు. అందుకే ఇప్పటికీ కూడా ఈమె ఇండస్ట్రీ లో క్యారక్టర్ ఆర్టిస్టు గా అవకాశాలను సంపాదించుకుంటూనే ఉంది. భర్త చనిపోయిన తర్వాత కొంత కాలం వరకు విరామం ఇచ్చిన మీనా, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఈమె కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నా, విక్టరీ వెంకటేష్ తో చేసిన ‘చంటి’ సినిమా ఎంతో ప్రత్యేకం.

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన చిన్న తంబీ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇందులో వెంకటేష్ అమాయకం గా ఎంత అద్భుతంగా నటించాడో, పెంకి పిల్లగా మీనా కూడా అంతే అద్భుతంగా నటించింది. ఈ చిత్రం లో మీనా పడుకునే మంచం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

- Advertisement -

ఎంతో విశాలంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మంచం కి ఒక హిస్టరీ ఉంది. ఇదే మంచం ని షూటింగ్స్ కోసం చాలా సినిమాలకు వాడేవారట. ‘పెద్ద రాయుడు’, ‘ఘరానా మొగుడు’ , ‘హలో బ్రదర్’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఇలా ఒక్కటా రెండా ఈ మంచం ని దాదాపుగా అన్నీ సినిమాలకు వాడారు. ప్రతీ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసినవే, అలా కేవలం ఈ మంచం తోనే అప్పట్లో కోట్ల వంద కోట్ల రూపాయిల లాభాలను తెచ్చి పెట్టిందని అంటూ ఉంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here