Samantha: తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది.. అయితే ఈ మధ్య సామ్ అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.. ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సామ్ నటించిన యశోద, శాకుంతలం సినిమా విడుదలయ్యాయి.. అయితే శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. అయితే ఈ విషయం పై తాజాగా ప్రముఖ నిర్మాత చిట్టి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
సమంతను ఇక మీద హీరోయిన్ గా తీసుకునే అవకాశం లేదని ఎందుకంటే ఆమెకు ముసలి మొఖం వచ్చేసిందని నిర్మాత,నటుడు చిట్టిబాబు అనటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అలాంటి ఫేస్ తో శాకుంతలం సినిమా ఎలా చేసిందో చూడాలని సినిమా ఎలా ఉంటుందో తాను కూడా చూడాలని అనుకుంటున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. కెమెరామెన్ ఏదైనా జిమ్మిక్కు చేస్తే తప్ప ఆ ముసలి ముఖాన్ని దాయడం కష్టమని ఆయన అన్నారు. ఒకప్పుడు ఆమె చాలా అద్భుతమైన సౌందర్యరాశి కానీ అనేక రకాల జబ్బుల బారిన పడి ఆమెకు ముసలి ముఖం వచ్చేసిందని చిట్టిబాబు పేర్కొన్నారు..
సమంత శాకుంతలం సినిమాను జబ్బుబారిన పడకముందు చేసింది.. అయితే సమంత కు ఇప్పుడు ఆఫర్లు రాలేదు.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ నుంచి ఎప్పుడు తప్పుకుంది..ఊ అంటావా ఊహూ అంటావా, అనే ఒక హాఫ్ న్యూడ్ సాంగ్ చేసిందంటూ చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత అనారోగ్యం వల్ల ముఖం పీక్కుపోయిందని అందుకనే ఏదేదో చేస్తుందని, తాను చనిపోయే లోపు ఇలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నాను అంటూ రకరకాల సినిమాలు సెట్ చేసుకుంటుందని ఆయన ఆరోపించారు…
సమంత అనారోగ్యం వల్ల ముఖం పీక్కుపోయిందని అందుకనే ఏదేదో చేస్తుందని. చనిపోయే లోపు ఇలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నాను అంటూ రకరకాల సినిమాలు సెట్ చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇక ఆ అమ్మాయి, ప్రతి సినిమా ముందు ఇలాంటి సెంటిమెంటల్ డ్రామాలు క్రియేట్ చేస్తూ వస్తోందని యశోద సినిమా సమయంలో కూడా డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఉన్న ఫోటో రిలీజ్ చేసిందని నిజానికి ఒకప్పుడు హై ఫీవర్ తో ఉండి నటించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.. ఎదో సెంటిమెంట్ కోసం ఆమె అలా చేస్తుందని చిట్టిబాబు పేర్కొన్నారు..ఇక సినిమాలకు పనికిరాదని తీవ్ర ఆరోపణలు చేశాడు.. మొత్తానికి నెట్టింట ఇవి వైరల్ గా మారాయి..