Priyanka Mohan : OG లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్..

- Advertisement -

Priyanka Mohan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీలైనంత త్వరగా తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా సినిమా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు పవర్ స్టార్.

ఇటీవల పవన్ కళ్యాణ్ వినోదయ సీతం సినిమాలో తన రోల్ కంప్లీట్ చేశారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. తాజాగా మంగళవారం ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సెట్లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈ సినిమా సెట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న కన్నడ బ్యూటీ కూడా షూటింగ్లో పాల్గొంది. అందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Priyanka Mohan
Priyanka Mohan

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గ్యాంగ్ స్టర్. తాజాగా ఈరోజు కన్నడ భామ ప్రియాంక అరుణ్ మోహన్ ఓజి సెట్ లో అడుగు పెట్టారు. ఇందులో ఆమె పవన్ సరసన నటించనున్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించి మెప్పించింది ప్రియాంక. అంతే కాకుండా తమిళంలో డాక్టర్, డాన్ , ఈటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్సును అందుకుంది ఈ కన్నడ భామ.

- Advertisement -
Priyanka Mohan In OG MOvie

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సినిమా షూటింగ్ లో నేడు కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలుపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా ఓ జి సెట్స్ నుంచి వరుసగా అప్డేట్స్ రావడం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు నటీనటుల సమాచారాన్ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ , క్రిష్ దర్శకత్వం వహించిన హరిహర వీరముల్లు సినిమా కూడా కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here