Priyanka Jawalkar : లంగావోణీలో ప్రియాంక జవాల్కర్ పరువాల విందు

- Advertisement -

Priyanka Jawalkar .. ఈ భామ అవ్వడానికి తెలుగమ్మాయే అయినా చూడ్డానికి మాత్రం నార్త్ హీరోయిన్​లా ఉంటుంది. టాక్సీవాలాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎస్​ ఆర్ కల్యాణమండపం, గమనం, తిమ్మరుసు వంటి చిత్రాలతో అలరించింది. తెరపై ప్రియాంక కనిపించినంత సేపు కుర్రాళ్లకు పండగే. ముఖ్యంగా ఎస్​ఆర్ కల్యాణమండపంలో ఈ భామ అందం, నటనకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలా ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం పెంచేసుకుంది.

priyanka jawalkar
priyanka jawalkar

అయితే ప్రస్తుతం మాత్రం ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగమ్మాయిలకు ఛాన్సులు తక్కువే అని తెలిసిందేగా. అయితే ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో తన పాపులారిటీని పెంచుకుంటుంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వాటిని అభిమానుల కోసం షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో కనిపించి సందడి చేసింది. లంగావోణిలో ఓవైపు అందంగా కనిపిస్తూ మరోవైపు హాట్​ హాట్​ పోజులతో పిచ్చెక్కింది. హాఫ్ శారీలో కూడా ఇంత హాటుగా ఉంటారా అనిపించేలా మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

priyanka jawalkar Photos

- Advertisement -

టమాటో రెడ్ అండ్ వయోలెట్ కలర్ లంగా వోణీలో ప్రియాంక ఈ ఫొటోల్లో కనిపించింది. అద్దం ముందు సెల్ఫీ దిగుతూ ఒక పోజు.. క్యూట్ స్మైల్ ఇస్తూ మరో పోజు ఇచ్చింది. ఇక తన స్మైల్​తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది ప్రియాంక. ఈ భామ ఫొటోలకు మామూలుగా లైక్స్ రాలేదు. ఇక కామెంట్ బాక్సులో అయితే కుర్రాళ్ల కొంటె మాటలకు కొదువే లేదు. ఇంత అందాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ అసలు ఎందుకు పట్టించుకోవడం లేదబ్బా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో లంగావోణీకే అందం తెచ్చావు ప్రియా అంటూ కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ప్రియాంక లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో మామూలుగా రచ్చ లేపడం లేదు. ఈ ఫొటోలు చూసైనా ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు ఇస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here