Bigg Boss Telugu : నామినేషన్స్ లోకి వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియాంక అవుట్!

- Advertisement -

Bigg Boss Telugu 7 మొదలై 50 రోజులు పూర్తి అయ్యింది. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కూడా మారుతూ వస్తున్నారు కానీ, ఆడవాళ్లు ఎలిమినేట్ అవ్వడం మాత్రం మారట్లేదు. ఈ 8 వారాలు ఆడవాళ్లే ఎలిమినేట్ అవ్వడం విశేషం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పూజ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. గత వారం నాయని పావని ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఇలా వరుసగా ఆడవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి , పాత కంటెస్టెంట్స్ లో ఎలిమినేట్ అయిన దామిని , రతికా మరియు శుభ శ్రీ లను సెలెక్ట్ చేసుకొని , హౌస్ మేట్స్ ద్వారా ఓటింగ్ జరిపి తక్కువ ఓట్లు తెచ్చుకున్న రతికా ని నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అయితే వచ్చే వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి.

Rathika rose

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన వారు శివాజీ, పల్లవి ప్రశాంత్, భోలే శవాలీ, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ మరియు యావర్. ఈసారి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో టాప్ 2 స్థానాల్లో శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, కానీ చివరి రెండు స్థానాల్లో మాత్రం భోలే శవాలీ మరియు ప్రియాంక ఉండే ఛాన్స్ ఉంది.

- Advertisement -
priyanka bhole

భోలే శవాలీ కి గత వారం సానుభూతి ఏర్పడింది, మంచి ఓటింగ్ వచ్చింది. కానీ టాస్కుల విషయం లో ఇతని నుండి ఇప్పటి వరకు ఎలాంటి గేమ్ కనపడలేదు. గత వారం ఉన్న ఓటింగ్ ట్రెండ్ ఈ వారం కూడా కొనసాగితే భోలే సేవ్ అయ్యి, ప్రియాంక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here