Priyanka Chopra : గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చొప్రా గురించి పరిచయం అక్కర్లేదు..దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది…వరుస సినిమాలతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. ఇకపోతే నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారలందరూ ఈవెంట్లో కొలువయ్యారు. వీరిలో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త నిక్ జోనాస్ తో పాటు ఈ NMACC లాంఛింగ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు.

ప్రియాంక చోప్రా బాలీవుడ్ కార్యక్రమానికి హాలీవుడ్ టచ్ ఇచ్చారు. గ్లోబల్ హీరోయిన్ గా ఇంటర్నేషనల్ ట్రెండ్ ఫాలో అయ్యారు.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి..ఇప్పుడు ముంబై వీధుల్లో ఆటోలో తిరుగుతూ రచ్చ చేసింది.ఈ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..40 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది. తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది..

ప్రస్తుతం ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఇండియాలో సందడి చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. తనకు మాత్రమే సాధ్యమైన గ్లామర్ షోతో ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపిస్తోంది. ముంబై వీధుల్లో ప్రియాంక,నిక్ ఆటోలో చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది…అంతే కాదు ఈవెంట్ కు ముందు ఫోటో షూటింగ్ లో ప్రియాంక పాల్గొంది.. అప్పుడు ఆమె వేసుకున్న బ్లౌజ్ కిందకు జారిపోయంది.. దాన్ని సరి చేసుకుంటూ చాలా అవస్థలు పడింది.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. దీన్ని చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఒకపారి ఆ వీడియోపై ఒక లుక్ వేసుకోండి..