Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసమే ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని వాయిదా వేసారా..? వైరల్ అవుతున్న పోస్ట్!

- Advertisement -

Pawan Kalyan : మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల అవ్వబోతుంది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గుతుగానే ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాగ ప్లాన్ చేసాడు త్రివిక్రమ్.

రీసెంట్ గా విడుదల చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట సినిమా పై మాస్ ఆడియన్స్ లో ఎలాంటి బజ్ ని ఏర్పాటు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అందరి చూపు థియేట్రికల్ ట్రైలర్ మీదనే ఉంది. ఈ సినిమా ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈరోజు ప్లాన్ చేసినట్టు గా నిర్మాతలు తెలిపారు. కానీ అనుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది .

కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నాం అని, కొత్త తేదీ ని త్వరలో తెలియచేస్తాము అంటూ ఒక పోస్ట్ వేశారు. దీనిపై ఫ్యాన్స్ నుండి మూవీ టీం కి చాలా తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగడానికి కారణం పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం అవుతుంది. ఆయన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా పిలిచారట మూవీ టీం.

- Advertisement -

పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకున్నాడట కూడా. కానీ ఆయన రాజకీయ పర్యటనలో బిజీ గా ఉండడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోతున్నాని మూవీ టీం కి చెప్పుకొచ్చాడట. దానికి తోడు అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరు కాబోతున్నారు అని పోలీసులకు సమాచారం అందడం తో, ఆ సభ వేదిక సరిపడదు అని అనుమతిని రద్దు చేశారట, అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడినట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here