Prashanth Neel : ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ సినిమా పైన రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడడంతో కంటెంట్ మీద చాలా అనుమానాలు వెల్లడవుతున్నాయి అభిమానులకు. అసలు సలార్ సినిమాలో ప్రభాస్ ఫేస్ ను ఇంత వరకు క్లియర్ గా చూపించిందే లేదు.
గతంలో రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ లో కూడా ప్రభాస్ ఫేస్ సరిగా కనిపించలేదు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీత్ మాత్రం పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి.. శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సీజీ వర్క్ కోసం మరింత టైం పడుతుంది. అందుకే ఈ సినిమాను డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఎన్ని వాయిదాలు పడినా ఈ సినిమా పైన డిమాండ్ మాత్రం కుసుమంత కూడా తగ్గలేదు. అయితే వాయిదాకు కారణం మాత్రం ఓటీటీ డీల్ సెట్ కాకపోవడమే అన్నట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఈ సినిమాకు ఏకంగా 110 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ సినిమాకి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో కూడా వాటాను ముందుగానే నిర్మాతలతో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ చిత్రాలకు కూడా డైరెక్టర్ ఈ తరహాలోనే డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సలార్ సినిమాకు దాదాపుగా రూ.100కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.