ప్రభాస్ నుంచి బాహుబలి రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ హోప్స్ అన్ని ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఉన్నాయి. అయితే ఈ మూవీలో వినూత్నంగా పాటలు మొత్తం బ్యాక్ గ్రౌండ్ లోనే వస్తుంటాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. మామూలుగా సినిమా అంటే మ్యూజిక్ కి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వినూత్నంగా ఉండడం కోసం ప్రశాంత్ నీరు తీసుకున్నటువంటి ప్రయోగాత్మకమైన నిర్ణయం మూవీ సక్సెస్ కు సహాయ పడుతుందా లేదా అనేది ప్రస్తుతం సందేహంగా ఉంది.
వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న ప్రభాస్ కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సలార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ పల్స్ క్యాప్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన డైరెక్టర్…మాస్ పవర్ కు నిదర్శనంగా నిలిచే హీరో.. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ తప్పక బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.
అయితే ప్రస్తుతం సలార్ చిత్రం గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మామూలుగా సినిమాల్లో వచ్చే పాటల్లాగా కాకుండా ఈ సినిమాలోని అన్ని పాటలు కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేట్టుగా డైరెక్టర్ తీసుకున్న డెసిషన్ షాకింగ్ గా ఉంది. అయితే ఇది కేవలం హీరోగా ప్రభాస్ యొక్క ఇమేజ్ను ఎంతో బలంగా ప్రదర్శించడానికి చేస్తున్న ప్లాన్ అట.ఎంతో వినూత్నంగా ఉన్న ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావాలి అంటే సలార్ సినిమా చూడాలి మరి.
బ్యాగ్రౌండ్ లో వచ్చే పాటల ద్వారా ప్రభాస్ యొక్క హీరోఇజం ని ఓ రేంజ్ఎ లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్. ఈ మూవీలో రొటీన్ గా హీరోయిన్ తో ఒక పాట ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి లాంటి కాన్సెప్ట్ అస్సలు ఫాలో అవ్వడం లేదు. ఈ వర్షం క్లిక్ అయితే రాబోయే చిత్రాలకు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఈ మూవీకి ఫేమస్ మ్యూజిషియన్ రవి బస్రూర్ కథకు తగ్గట్టుగా మ్యూజిక్ ని అందిస్తున్నారట.