Pranitha : పెళ్లయి ఓ పిల్లకు తల్లయ్యావ్ మర్చిపోయావా.. ఏంటి ఆ ఎక్స్ పోజింగ్ బొమ్మ

- Advertisement -


Pranitha : తనీష్ సరసన ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్. చారడేసి కళ్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో బాపుబొమ్మగా ప్రేక్షకుల చేత పిలిపించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సరస చేసినప్పటికీ తాను స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. తన మాతృభాష కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ పోకిరి రీమేక్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అవకాశాలు కనుమరుగు కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చి 2021లో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.

Pranitha
Pranitha

హిందీలో హంగామా2తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం కన్నడలో ఒకటి మలయాళంలో ఒకటి షూటింగ్ దశలో ఉన్నాయి. తెలుగులో చివరిగా హలో గురు ప్రేమకోసమే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. సినిమాలలో ఛాన్సులు తగ్గినప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఇన్ స్టాలో తనకి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉంటుంది. తల్లి అయినప్పటికీ తన హాట్ హాట్ ఫోటోలని ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూనే ఉంది. ప్రణీతకు ప్రస్తుతం ఏడాది వయసున్న కూతురుంది. కూతురుతో స్పెండ్ చేసిన వీడియోలను కూడా ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలన్నీ కొట్టొచ్చినట్లు కనిపించేలా.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని గ్లామర్ లుక్స్ తో మెరిసిపోతున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో కుర్రకారు వేడేక్కిపోతుంది. కరెక్ట్ గా ఇంట్రస్ట్ చూపిస్తే హీరోయిన్ గా వరుస అవకాశాలు గ్యారంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోకు ఇప్పటికి 72,617 పైగా వ్యూస్ వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here