కన్నడ హీరోయిన్ ప్రణిత సుభాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిపోతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది.. నడుమందాలతో మెస్మరైజ్ చేస్తుంది.. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్యూటీఫుల్ హీరోయిన్, కన్నడ భామ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.ఈ అమ్మడు ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘బావ’ చిత్రంతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది..
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు ట్రై చేస్తుంది.. ఈ మేరకు సోషల్ లో ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ సరసన కూడా ఓ సినిమా చేసింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు కేరీర్ పీక్స్ లో ఉంటుందని అనుకున్నారు.. కానీ ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు..
2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లి చేసుకుంది. ఇరు సంప్రదాయ పద్ధతుల్లో వెడ్డింగ్ జరిగింది. కోవిడ్ కారణంగా ఎలాంటి ఆడంభరాలు లేకుండా వివాహ వేడుక ముగిసింది. ఇక గతేడాది జూన్ 10న పండంటి ఆడబిడ్డకు కూడా ప్రణీత జన్మనిచ్చింది.
తల్లిగా ప్రమోషన్ పొందింది.. చాలా కాలం తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అందాల రచ్చ చేస్తోంది. ప్రణీత పెళ్లై, కూతురు పుట్టిన ఏమాత్రం తగ్గని గ్లామర్ తో ఆకట్టుకుంటుంది… ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది..