Pragya Jaiswal .. కంచె సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మాయంటే ఇలా ఉండాలి అని కుర్రాళ్లు అనుకునేలా ఆ సినిమాలో ఈ బ్యూటీ నటన అలరించింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టినా ఈ భామకు ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కంచె తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్లో నక్షత్రం, జయజానకి నాయక, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, సన్ ఆఫ్ ఇండియాలో నటించింది. కానీ ఇందులో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

డజను సినిమాలు చేసినా.. కంచె తర్వాత ప్రగ్యాకు సరైన హిట్ రాలేదు. 2021లో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన అఖండ సినిమాతో ప్రగ్యాకు మళ్లీ హిట్ వచ్చింది. హిట్ అంటే అలాంటి ఇలాంటి హిట్ కాదు.. బ్లాక్‌బస్టర్ బంపర్ హిట్. ఈ సినిమాలో ప్రగ్యా కలెక్టర్‌గా నటించి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఇంత సూపర్ హిట్ మూవీ వచ్చిన తర్వాత ఈ బ్యూటీ కెరీర్ మారుతుందని అంతా ఊహించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా ప్రగ్యాకు అవకాశాలు రాలేదు.

అయినా ప్రగ్యా నిరాశ చెందలేదు. సినిమాలు లేకపోయినా ప్రగ్యా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు తనను మరిచిపోకుండా చేస్తోంది. ఇక నెట్టింట ఈ బ్యూటీ తన బోల్డ్ ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ అఖండ బ్యూటీ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

మొన్నటిదాకా బోల్డ్ ఔట్‌ఫిట్స్‌తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన ప్రగ్య.. ఈసారి ట్రెడిషనల్ ఔట్ఫిట్లో సందడి చేసింది. పింక్ కలర్ లెహంగాలో ముంబయిలో ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరైంది. ఈ ఔట్ఫిట్లో ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కనిపిస్తోంది. ట్రెడిషనల్ లుక్‌లో ఈ బ్యూటీ చాలా క్యూట్‌గా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.