Pargya Jaiswal : ఫుల్ మేకప్ తో పార్టీలో రచ్చ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. లిప్స్ చూస్తే తట్టుకోలేరు…

- Advertisement -

Pragya Jaiswal : వరుస సినిమాలు లేకున్నా కూడా గ్లామర్ షో చేస్తూ పిచ్చెక్కిస్తున్న వారిలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ముందు వరుసలో ఉంటుంది.ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.ఆ సినిమా తర్వాత మళ్ళీ అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి.. దాంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో వైరల్ అయ్యాయి..

బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది.అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాయి.కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

- Advertisement -

బాలయ్య మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ కామెంట్స్ ను కూడా అందుకుంటుంది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. ఓ పార్టీలో తన ఫ్రెండ్స్ తో కలసి రచ్చ చేస్తున్న ఫొటోస్ ని పంచుకుంది. పార్టీ కావడంతో ప్రగ్యా కంప్లీట్ మేకప్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె లిప్స్ అయితే యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. అంత క్రేజీగా ఆమె చూపులు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ హాట్ గా కనిపిస్తే ఆ పిక్స్ ఎలా వైరల్ అవుతాయో చెప్పనక్కర్లేదు.. పాపం ఆమె కష్టాన్ని చూసి ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుండు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here