Anchor Pradeep : వైరల్ గా మారిన యాంకర్ ప్రదీప్ కాబోయే భార్య ఫోటో.. తెగ సిగ్గుపడుతున్నాడుగా

- Advertisement -

Anchor Pradeep : తెలుగు బుల్లితెరపై ఎక్కువగా లేడీ యాంకర్లే హవాను చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టాప్ హోస్టుగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీరియల్ నటి ప్రదీప్ కాబోయే భార్య ఫొటో లీక్ చేసింది.

Anchor Pradeep
Anchor Pradeep

అద్భుతమైన హోస్టింగ్‌తో బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్న ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా వచ్చాడు. క్రేజీగా వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ సక్సెస్ అయింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ ఢీ ప్రీమియర్ లీగ్, డ్రామా జూనియర్స్, సర్కార్ 3 సహా ఎన్నో షోలను హోస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా జీ తెలుగులో సూపర్ క్వీన్ 2ను కూడా నడుపుతున్నాడు. ఇందులో అమ్మాయిలతో కలిసి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న సూపర్ క్వీన్ 2 షో ఆదివారంతో ముగియనుంది. ఫినాలే ఎపిసోడ్‌కు హిడింబ టీమ్ వచ్చి సందడి చేసింది. ఇందులో నటించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే.. అప్పట్లో స్వయంవరం అనే ఏదో షో చేశావు.. అలాంటిదేనా ఇది అని అడిగారు. దీనికి ప్రదీప్ అది సామాన్లు సర్దేశారు అయిపోయింది అన్నాడు. సూపర్ క్వీన్ 2 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో భాగంగా టాప్ 5 కంటెస్టెంట్లలో నిలిచిన ప్రముఖ సీరియల్ నటి లిఖిత.. యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఓ ఫొటో ఫ్రేమ్‌ను గిఫ్టుగా ఇచ్చింది. అది స్టేజ్ మీదే ఓపెన్ చేసిన అతడు ఎంతగానో మురిసిపోయాడు. అప్పుడు పక్కన ఉన్నవాళ్లు ప్రదీప్‌కు కాబోయే భార్య ఫొటో ఇది అని కామెంట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here